food items to improve Haemoglobin,హీమోగ్లోబిన్ స్థాయిలను పెంచే ఆహారపదార్ధాలు :
ఎనీమియా – రక్తహీనత–స్త్రీలలో, పిల్లల్లో కనపడే ముఖ్యమైన బలహీనత – రక్తం తక్కువగా ఉండడం ఇది ముఖ్యంగా మూడు కారణాల వలన వచ్చును.
1.పౌష్టికాహార లోపం – ఐరన్ (ఇనుము ధాతువు) కలిగిన ఆకుకూరలు (తోటకూర, గోంగూర) బెల్లం, మాంసాహారంలోను ఎక్కువ నిలువలుండును. ఇవి గలిగిన ఆహారం సమతుల్యంతో తీసుకోకపోవడం.
2.రక్తం నష్టపోవడం – స్త్రీలు ఋతుస్రావం ద్వారా, పిల్లలు కడుపులో నత్తల ద్వారా, క్రమేపి రక్తాన్ని కోల్పోయి, రక్తహీనతకి గురి అవుతారు.
3.రక్తం తయారీలో అవరోధం – జబ్బుల వలన ఉదా. మలేరియా, రక్తంలోని ఎర్ర కణాలు ధ్వంసం అయి మరల పెరగవు. దీంతో రక్తం తయారవక రక్తహీనత కనపడుతుంది.
లక్షణాలు : నాలిక, కనురెప్పల క్రింద, గోళ్ళు తెల్లగా పాలిపోయినట్లు ఉండడం బలహీనం, నిరాశక్తత, సాధారణ పనులకే ఆయాసం రావడం.
చికిత్సా విధానం : చిన్న పిల్లలకి నట్టలు తొలగించి మందు ఇవ్వాలి. మల విసర్జన తరువాత చేతులు సబ్బుతో తోముకునేలా అలవాటు చేయించాలి. ఇనుము ఎక్కువగా ఉండే ఆహారం (ఆకుకూరలు, పొట్టుతోటి ధాన్యాలు, మాంసాహారం) తీసుకునేట్లు చేయాలి. యుక్త వయస్సు నుండి సంతానం పొందు వయసు మధ్యలో గల స్త్రీలందరికి ఎ.ఎన్.ఎం. సహాయంతో ఉచితంగా లభ్యం అయ్యే ఐరన్, పోలిక్ యాసిడ్ మాత్రలు ఇవ్వాలి.
Food items to improve Hemoglobin,హీమోగ్లోబిన్ స్థాయిలను పెంచే ఆహారపదార్ధాలు :
పుచ్చ :

ఈ పండులో అత్యధిక స్థాయిలో ప్రోటీన్లు , కార్బోహైడ్రేట్స్ , పొటాషియం , విటమిన్ – సి , బి , ఉంటాయి . ఆహారము లో ఐరన్ ఎక్కువగా ఉన్నప్పుడు శరీరము లో శక్తి , ఓపిక పెరుగుతాయి .
బెర్రీస్ :

నలుపు ,బ్లూ , క్రౌన్ రకము గల బెర్రీలు , స్ట్రా బెరీలల్తో కొన్ని రకాలయిన బెర్రీఅలలో ఐరన్ అత్యధికము గా లభ్సుంది. వీటిలో యాంటీ ఆక్షిడెంట్స్ , ఎ, ఇ – విటమనులు కూడా ఉంటాయి .
ఖర్జూరము :

వెట్ , డరి ఖర్జూరాలు రెండింటిలోనూ ఆరోగ్యానికి ఉపకరించే పోషకాలు అత్యధికము గా ఉండును ఇందులో పొటాహియం మెగ్నీషియం లాల్సియం లు హీమోగ్లోబిన్ ను పెంచును ,
పండ్లు – కూరగాయలు , : బీట్ రూట్ , ఆరెంజ్ ,క్యారెట్ , బ్రేక్ ఫాస్ట్ కి ముందు తాగితే హీమోగ్లోబిన్ స్థాయిలు పెరుగును .
మీట్ :

మీరు మాంసాహారులైతే మటన్ రెగ్యులర్ గా తింటే మంచి హీమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి , గుడ్లు , షెల్ ఫిష్ .. ఐరన్ స్థాయిలు పెంచుతాయి. అత్యధికము గా కెఫిన్ , గ్లూటెన్ ఉన్న పధార్ధాలు తినకూడదు .
Source: http://food-health-disease.blogspot.com/search/label/%E0%B0%B9%E0%B1%80%E0%B0%AE%E0%B1%8B%E0%B0%97%E0%B1%8D%E0%B0%B2%E0%B1%8B%E0%B0%AC%E0%B0%BF%E0%B0%A8%E0%B1%8D%E2%80%8C%20%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A5%E0%B0%BE%E0%B0%AF%E0%B0%BF%E0%B0%B2%E0%B0%A8%E0%B1%81%20%E0%B0%AA%E0%B1%86%E0%B0%82%E0%B0%9A%E0%B1%87%20%E0%B0%86%E0%B0%B9%E0%B0%BE%E0%B0%B0%E0%B0%AA%E0%B0%A6%E0%B0%BE%E0%B0%B0%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81